బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం జగన్. విశాఖలో గ్యాస్‌ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ ప్రమాద స్థలంలో పర్యటించారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఘటన చాలా బాధ కలిగించిందన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో […]

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 3:14 PM

మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం జగన్. విశాఖలో గ్యాస్‌ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ ప్రమాద స్థలంలో పర్యటించారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఘటన చాలా బాధ కలిగించిందన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారన్నారు జగన్.

కాగా మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఆస్ప్రతుల్లో 2, 3 రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు సీఎం జగన్.

అలాగే చనిపోయిన పశువుల యజమానులకు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకు మంచి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు జగన్.

Read More: 

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి

గ్యాస్ లీక్‌ ఘటనపై స్పందించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!