గ్యాస్ లీక్‌ ఘటనపై స్పందించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ

విశాఖలో గ్యాస్ లీక్‌ ఘటనపై పాల్జీ పాలిమర్స్ కంపెనీ స్పందించింది. కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్‌లో లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. 2,400 టన్నుల ట్యాంక్ కెపాసిటీ ఉన్నట్లు కంపెనీ జనరల్ మేనేజర్ మోహన్ రావు తెలిపారు. అలాగే ప్రస్తుతం 1,800 టన్నుల స్టైరిన్ మోనోమార్ ఉందన్నారు. కంటిన్యూగా సిస్టమ్ లేకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఇన్హిబిటర్‌తో కంట్రోల్ చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. మరో 4 గంటల సమయం పడుతుందని.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రజలు గ్రామాలోకి […]

గ్యాస్ లీక్‌ ఘటనపై స్పందించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 1:45 PM

విశాఖలో గ్యాస్ లీక్‌ ఘటనపై పాల్జీ పాలిమర్స్ కంపెనీ స్పందించింది. కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్‌లో లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. 2,400 టన్నుల ట్యాంక్ కెపాసిటీ ఉన్నట్లు కంపెనీ జనరల్ మేనేజర్ మోహన్ రావు తెలిపారు. అలాగే ప్రస్తుతం 1,800 టన్నుల స్టైరిన్ మోనోమార్ ఉందన్నారు. కంటిన్యూగా సిస్టమ్ లేకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఇన్హిబిటర్‌తో కంట్రోల్ చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. మరో 4 గంటల సమయం పడుతుందని.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రజలు గ్రామాలోకి రావచ్చని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పేర్కొంది.

కాగా ప్రస్తుతం సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. ఇప్పటికే వైజాగ్‌లో విషవాయువు లీక్ ఘటన తెలీగానే అక్కడి కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వైజాగ్ బయలు దేరారు సీఎం. కాగా ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు కూడా స్పందించారు.

Read More: విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి