ఆసుపత్రి ఫీజు కింద అవయవాలు మాయం.. హెచ్చార్సీ ముందుకు భార్య

ఆసుపత్రి బిల్లు చెల్లించలేని ఓ నిరుపేద శవం నుంచి అవయవాలను మాయం చేసిన ఉదంతం ఒకటి నాలుగేళ్ళ తర్వాత వెలుగు చూసింది. తనకు తెలియకుండా తన భర్త భౌతిక కాయం నుంచి ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ, లివర్, రెండు కళ్ళను తొలగించిందంటూ మృతుని భార్య జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దాంతో నాలుగేళ్ళ క్రితం అంటే 2016లో జరిగిన ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఆసుపత్రి ఫీజు కింద అవయవాలు మాయం.. హెచ్చార్సీ ముందుకు భార్య
Follow us

|

Updated on: May 07, 2020 | 2:24 PM

ఆసుపత్రి బిల్లు చెల్లించలేని ఓ నిరుపేద శవం నుంచి అవయవాలను మాయం చేసిన ఉదంతం ఒకటి నాలుగేళ్ళ తర్వాత వెలుగు చూసింది. తనకు తెలియకుండా తన భర్త భౌతిక కాయం నుంచి ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ, లివర్, రెండు కళ్ళను తొలగించిందంటూ మృతుని భార్య జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దాంతో నాలుగేళ్ళ క్రితం అంటే 2016లో జరిగిన ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

విశాఖ నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో తన భర్త అవయవాలను తనకు తెలియకుండా తొలగించారంటూ ఓ మహిళ జాతీయ మానవహక్కుల సంఘాన్ని, విశాఖ పోలీసులను ఆశ్రయించింది. జీవన్ దాన్ కార్యక్రమాన్ని ఇందుకోసం వినియోగించుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఒడిశాలోని గంజాం ప్రాంతంలోని జాగాపూర్‌కు చెందిన కడియాల సహదేవ్ అనే వ్యక్తం 2016 డిసెంబర్ 13వ తేదీన ఇచ్ఛాపురం దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని విశాఖ సిటీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ డిసెంబర్ 19వ తేదీన బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అప్పటికే ఆసుపత్రి బిల్లు తడిసి మోపేడు అయ్యింది.

ఆసుపత్రి బిల్లు లక్షన్నర దాటిపోవడంతో యాజమాన్యం బిల్లు చెల్లించాలని సహదేవ్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. వారి దగ్గర మనీ లేకపోవడంతో సహదేవ్ శరీరం నుంచి రెండు కళ్ళు, కాలేయం, మూత్రపిండాలను జీవన్ దాన్ పథకం కింద దానం చేస్తే ఆసుపత్రి బిల్లుకు లెక్క సరి చేస్తామని యాజమాన్యం ఆఫర్ ఇచ్చింది. మరో దారి లేక వారు సరేననడతో కిడ్నీలు, కళ్ళు, లివర్ తీసుకున్నారు.

అయితే, జీవిత భాగస్వామికి తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా అవయవాలు ఎలా తీసుకున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సహదేవ్ జీవిత బీమా సొమ్ముల కోసం ఇన్సూరెన్సు కంపెనీని ఆశ్రయించారు బాధిత మహిళ. డెత్ రిపోర్టు తీసుకున్న సదరు జీవిత బీమా సంస్థ.. మృతుని శరీరంలో అవయవాలు లేకపోవడంతో బీమా సొమ్ము చెల్లించేందుకు నిరాకరించింది. దాంతో ఖంగుతిన్న మృతుని భార్య.. జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బెర్హంపూర్ న్యాయస్థానంలోను ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో స్థానిక పోలీసులకు దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు అందాయి.

కోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన ఒడిశా పోలీసులు రెండు నెలల క్రితం అంటే 2020 మార్చి నెలలో విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దాంతో వారు జరిగిన విషయాన్ని కూపీ లాగారు. అయితే, సహదేవ్ చనిపోయినప్పుడు విశాఖ టూ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనాడు జరిగిన దర్యాప్తులో లోటుపాట్లున్నాయని ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు తేలినట్లు సమాచారం. దాంతో డీసీపీ-1 రంగారెడ్డి సదరు ఎస్.ఐ.కి చార్జ మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై జాతీయ మానవహక్కుల సంఘం నివేదిక కోరినట్లు సమాచారం.