ఏపీలో కరోనా ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న సమయంలో చికెన్ ధరలు డౌన్.. రీజన్ ఇదే…
ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ రేటు ఏకంగా రూ.70 - 80 వరకు తగ్గిపోయింది. గత వారం బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 220 లెక్కన ఉండగా..
ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ రేటు ఏకంగా రూ.70 – 80 వరకు తగ్గిపోయింది. గత వారం బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 220 లెక్కన ఉండగా, ప్రజంట్ ఆ రేటు రూ.140- 150కి పడిపోయింది. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్ ధర ఇప్పుడు 80 రూపాయిలుగా ఉంది. వేసవి నేపథ్యంలో 30 శాతం వరకు వినియోగం తగ్గింది. దీంతో ధరలపై తీవ్రమైన ప్రభావం పడింది. కరోనా వ్యాధితో పోరాటం సాగించేందుకు… ఇమ్యూనిటీ కోసం జనాలు చికెన్ బాగా తింటున్నారు. అందుకే ఆ మాత్రమైనా ధరలు ఉన్నాయి.
చికెన్ మాత్రమే కాదు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్లకు రూ. 50- 60 వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌గా ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు. ఓవైపు ఎండాకాలం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో… కోళ్లు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదర్కోవాల్సి వస్తుంది. కోవిడ్ ప్రభావంతో కూలీలు కూడా సరిగ్గా దొరక్క కోళ్ల ఫారాలను మూసివేయాల్సి వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు.
Also Read: మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?