తెలంగాణ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ కౌన్సిలింగ్‌లో మార్పులు..
తెలంగాణ విద్యార్ధులకు గమనిక. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు, కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వెబ్..

Telangana Eamcet Counselling: తెలంగాణ విద్యార్ధులకు గమనిక. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో పలు మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు, కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వెబ్ ఆప్షన్ల నమోదును వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. రేపట్నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలిన యధాతధంగా కొనసాగుతుందన్నారు. అలాగే ఈ నెల 18 నుంచి 22 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఇక అక్టోబర్ 22న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ మార్పులను విద్యార్ధులు గమనించాలని అధికారులు సూచించారు.
Also Read:
ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..
