కేంద్రం కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో తేనె, పుట్టగొడుగులు.!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో రెండు పోషకమైన ఆహార పదార్ధాలను చేర్చనుంది.

కేంద్రం కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో తేనె, పుట్టగొడుగులు.!
Follow us

|

Updated on: Oct 10, 2020 | 3:13 PM

Honey, Mushrooms in Mid Day Meal: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో రెండు పోషకమైన ఆహార పదార్ధాలను చేర్చనుంది. ఇక నుంచి పిల్లలకు తేనె, పుట్టగొడుగులు అందించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. గత 12 ఏళ్లుగా దేశంలో తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని.. వీటిని పిల్లలకు అందించడం ద్వారా వారికి మానసికంగా, శారీరికంగా సరైన ఎదుగుదల ఉంటుందని వ్యవసాయ శాఖ సూచనలు ఇచ్చింది.

అలాగే ఈ రెండు ఆహార పదార్ధాలను మధ్యాహ్న భోజన పధకం(ఎండీఎం), ఇంటిగ్రేటడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్)లో చేర్చి రైతులకు సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి కైలాష్ చౌదరి.. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు. దీనితో మధ్యాహ్న భోజనం మెనూలో తేనె, పుట్టగొడుగులను చేర్చాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం ఇచ్చిన సూచనతో ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆ రెండింటిని మధ్యాహ్న భోజనంలో చేర్చింది. అంతేకాదు దీని కోసం 15 శాతం అదనపు నిధులను కావాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కాగా, దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మందికి మధ్యాహ్న భోజనం అందుతోంది.

Also Read: 

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.