తెలంగాణలో రోడ్ల మరమ్మత్తులకు నిధులు విడుల చేసిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సుదీర్ఘ కాలంలో పెండింగ్‌లో ఉన్న రూ. 202.3 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. 

తెలంగాణలో రోడ్ల మరమ్మత్తులకు నిధులు విడుల చేసిన కేంద్రం
Follow us

|

Updated on: Oct 23, 2020 | 4:26 PM

తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, మరమత్తులకు సంబంధించి సుదీర్ఘ కాలంలో పెండింగ్‌లో ఉన్న రూ. 202.3 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.  ఈ సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిపాదనల గురించి పలు దఫాలుగా కిషన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 23, 2020న)  గడ్కరీతో  కిషన్ రెడ్డి సమావేశమైన అనంతరం ఈ నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వరదలు, భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు బాగా దెబ్బతిన్న సమయంలో ఈ నిధులు వస్తుండటం శుభపరిణామం. ఈ మొత్తాన్ని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ .. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ పనుల కోసం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. వరదలు, అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని పూరిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టే మరమ్మత్తు, పునరావాస కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి  జి. కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Also Read :

( కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి )

( హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం )

( మళ్లీ వస్తోన్న పబ్‌జీ, పేరెంట్స్ గుండెల్లో గుబులు ! )