AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?

క్యాన్సర్.. ఇది ప్రాణాంతక వ్యాధి. ఒంట్లో సైలెంట్ గా వృద్ధి చెంది ఒక్కసారిగా ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే ఈ వ్యాధి వాడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ.. మన రోజు వారీ కొన్ని అలవాట్లు ద్వారా జీవితంలో దీని బారీన పడకుండా అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏం చేయాలంటే..

Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?
Healthy Habits To Reduce Cancer Risk
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 2:42 PM

Share

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ సరైన జీవనశైలి, ఆహారాన్ని పాటించడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జన్యువులకు సంబంధించిన కొన్ని కేసులు మినహా, చాలా వరకు క్యాన్సర్ కేసులు మన రోజువారీ అలవాట్లు, ఆహారానికి సంబంధించినవేనని డాక్టర్ రోహిత్ కపూర్ అంటున్నారు. అందువల్ల, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి క్యాన్సర్‌ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన ఆహారం

ఆకుకూరలు, పండ్లు, పోషకమైన ఆహారాలు తినడం చాలా ముఖ్యం. ఆహారంలో నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, మసాలాలను అధికంగా తీసుకోవడం మానుకోవాలి.

పొగాకు, మద్యానికి దూరం దూరం

పొగాకు, మద్యం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ధూమపానం, పొగాకు వాడకం నోరు, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మద్యం సేవించడం వల్ల కాలేయ క్యాన్సర్ రావచ్చు. అందువల్ల ఈ అలవాట్లకు దూరంగా ఉండటం అత్యవసరం.

ఇవి కూడా చదవండి

బరువును అదుపులో ఉంచుకోవడం

అధిక బరువు ఉండటం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోజుకు కనీసం 15–20 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

ఫ్యామిలీలో క్యాన్సర్‌ చరిత్ర ఉంటే మరింత అప్రమత్తత

కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు తరతరాలకు సంక్రమించవచ్చు. అందువల్ల 20 ఏళ్ల వయస్సు తర్వాత క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేయించుకోవడం ముఖ్యం.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us