ఇక జాదవ్ పై సజావుగా విచారణ.. హరీష్ సాల్వే
పాకిస్తాన్ చెరలో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ కు ఇచ్చిన తీర్పు పట్ల ఈ కేసులో భారత్ తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. ఇక జాదవ్ పై పాక్ రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతుందని, అన్ని ఆరోపణల నుంచి బయటపడతాడని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఒక లాయర్ గా నాకెంతో సంతోషంగా ఉంది. ఈ తీర్పుతో రిలీఫ్ ఫీలవుతున్నాను. జాదవ్ కి మరణశిక్ష […]
పాకిస్తాన్ చెరలో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ కు ఇచ్చిన తీర్పు పట్ల ఈ కేసులో భారత్ తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. ఇక జాదవ్ పై పాక్ రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతుందని, అన్ని ఆరోపణల నుంచి బయటపడతాడని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఒక లాయర్ గా నాకెంతో సంతోషంగా ఉంది. ఈ తీర్పుతో రిలీఫ్ ఫీలవుతున్నాను. జాదవ్ కి మరణశిక్ష లేదని కోర్టు చెప్పడంతో చాలా సంతోషిస్తున్నా అన్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ కేసుపై పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తుందో తానిప్పుడే చెప్పలేనన్నారు. అది తొందరబాటే అవుతుంది అన్నారు. జాదవ్ కేసు విషయమై పాక్ ఇండియాకు … తాను తీసుకునే తదుపరి చర్యల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉందన్నారు. భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం కూడా జాదవ్ విడుదలకు త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా అని హరీష్ సాల్వే పేర్కొన్నారు.