Call money case: హైదరాబాద్: ఆన్‌లైన్ మనీ కేసులో మరో ముఠా అరెస్టు.. రూ.2 కోట్లు సీజ్, నలుగురి అరెస్టు
ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు చైనా వాసులు సహా నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి...
ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు చైనా వాసులు సహా నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్లను సీజ్ చేశారు. అలాగే రెండు ల్యాబ్ టాప్ లు, నాలుగు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన చైనా వాసి డెన్నిస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్థానికులతో కలిసి రెండు డిజిటల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. గుర్గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 యాప్ లు సృష్టించి రుణాలు ఇచ్చి ఈ దందా కొనసాగిస్తున్నారని వివరించారు. మరో కీలక నిందితులు జియాజాన్గ్, ఉమాపతి పరారీలో ఉన్నారు. జియాజాన్గ్ సింగపూర్ లో ఉన్నట్లు గుర్తించామని, మైక్రో ఫైనాన్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ కు లేఖ రాశామన్నారు. ఇప్పటి వరకు 116 యాప్స్ ను డిలీట్ చేయాలని గూగుల్ కు లేఖ రాసినట్లు సజ్జనార్ తెలిపారు.