మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. ఒక్క పరుగు ఇవ్వకుండా భయపెట్టిన తోపుగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
T20I Maiden Overs: భారత్ తరఫున T20Iల్లో అత్యధిక మెయిడీన్ ఓవర్స్ వేసిన బౌలర్ ఎవరో తెలుసా..? ఈ లిస్ట్‌లో 13 మెయిడిన్లతో యార్కర్ కింగ్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా వెస్టిండీస్ టీంతో జరిగిన తొలి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కూడా మెయిడీన్ ఓవర్లతో భయపెట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేరు వినగానే వేగం, కచ్చితత్వం, యార్కర్స్ గుర్తొస్తాయి. టీ20 క్రికెట్‌లో బ్యాటర్లపై ఆ ప్రభావాన్ని మరో రికార్డు కూడా చూపిస్తోంది. భారత్ తరపున టీ20Iల్లో అత్యధిక మెయిడీన్ ఓవర్లు (Maiden Overs) వేసిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో ఏకంగా 13 మెయిడీన్ ఓవర్స్ ఉన్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ 10 మెయిడిన్ ఓవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అక్షర్ పటేల్ 6 మెయిడిన్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో 5 మెయిడిన్లు సాధించారు.
బుమ్రా తర్వాత భువీ..
టీ20 ఫార్మాట్‌లో ప్రతి బంతికీ పరుగులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆటలో పూర్తి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ముగించడం బౌలర్‌కు ప్రత్యేక ఘనత. భారత్ తరపున ఈ విషయంలో బుమ్రా తన ఆధిపత్యాన్ని చూపించాడు.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు.. క్రీజులోకి అడుగుపెడితే పూనకాలే..!
భారత్ తరఫున T20Iల్లో అత్యధిక మెయిడీన్ ఓవర్స్ వేసిన బౌలర్లు:
జస్ప్రీత్ బుమ్రా – 13
భువనేశ్వర్ కుమార్ – 10
అక్షర్ పటేల్ – 6
హర్భజన్ సింగ్ – 5
హార్దిక్ పాండ్యా – 5
పవర్‌ప్లేలో వికెట్ మెయిడిన్లు..
మొదటి 1–6 ఓవర్లలో వికెట్ తీస్తూనే మెయిడీన్ ఓవర్స్ పూర్తి చేయడం మరింత ప్రత్యేకమైన బౌలింగ్ ప్రదర్శనగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విభాగంలో భువనేశ్వర్ కుమార్ 6 వికెట్స్ తోపాటు మెయిడీన్ ఓవర్స్ తో భారత బౌలర్లలో టాప్‌లో ఉన్నాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 4 సాధించారు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్ మెయిడిన్లు నమోదు చేశారు.
1–6 ఓవర్లలో భారత్ తరపున మెయిడీన్ ఓవర్స్:
భువనేశ్వర్ కుమార్ – 6
జస్ప్రీత్ బుమ్రా – 4
అక్షర్ పటేల్ – 4
హార్దిక్ పాండ్యా – 2
రవి బిష్ణోయ్ – 2
రికార్డుల్లో బౌలింగ్ క్లాస్..
టీ20 క్రికెట్‌లో ఎకానమీ, స్ట్రైక్ రేట్, వికెట్స్ వంటి గణాంకాలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే మెయిడీన్ ఓవర్ బ్యాటింగ్ జట్టుపై వెంటనే ప్రెజర్ పెంచే ఆయుధంగా నిలుస్తుంది. భారత్ తరపున బుమ్రా, భువనేశ్వర్ వంటి బౌలర్లు ఈ విభాగంలో చూపించిన స్థిరత్వం వారి బౌలింగ్ కంట్రోల్‌ను ప్రతిబింబిస్తుంది.
ఎక్కువమంది చదివినది: IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!
టీ20ఐల్లో అత్యధిక మెయిడీన్ ఓవర్స్ రికార్డు బుమ్రా ఖాతాలో ఉండగా, పవర్‌ప్లే మెయిడీన్ ఓవర్స్ విషయంలో భువనేశ్వర్ కుమార్ ముందంజలో ఉన్నాడు. ఈ గణాంకాలు టీ20ల్లో పరుగులను కట్టడి చేస్తూ వికెట్లు సాధించే భారత బౌలర్ల ప్రత్యేకతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
