Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది..అందమైన ప్రేమ కథగా ‘హైకూ’.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన శ్రీదేవి కోర్టు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు 'హైకూ' అనే మరో అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానుందీ అందాల తార. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ అంచనాలకు తగ్గట్టు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ స్నేహం, ప్రేమ అనే ఎమోషన్స్‌ని చూపించారు. ఇక కాలేజ్ లైఫ్, జాబ్ లైఫ్‌లో ఉన్న లవ్ స్టోరీతో కథలోని సంఘర్షణను అందంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్‌తో ‘హైకూ’ కథ సారాంశాన్ని చెప్పేశారు. ‘హైకూ’ ఓ అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోందని ఈ ట్రైలర్ చెబుతోంది. మ్యూజిక్ ఎంతో సూథింగ్‌గా ఉండగా.. విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కి నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ‘హైకూ’ అక్టోబర్ 23న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
‘హైకూ’ షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘హైకూ’ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా, శక్తి ప్రణేష్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సిద్ధు కుమార్ సంగీత దర్శకుడిగా, ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసేందుకు‘హైకూ’ సినిమా 2026 అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది
హైకూ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




