ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా.. రాజస్ధాన్ లో బాలుడు మృతి

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్  కారణంగా మరో చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రాజస్ధాన్ కోటా ప్రాంతంలో జరిగింది. స్ధానికంగా ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడు  టిక్ టాక్ వీడియోలకు ఆకర్షితుడై  తను కూడా ఒక  సెల్ఫీ వీడియో తీయాలకున్నాడు. తల్లి మంగళ సూత్రాన్ని మెడలో వేసుకుని, గాజులు తొడుక్కుని బాత్ రూమ్ లోకి వెళ్లాడు. అయితే  వీడియో తీసే క్రమంలో బాలుడి మెడలో ఉన్న మంగళసూత్రం  బాత్రూం సందులో ఇరుక్కు […]

  • Anil kumar poka
  • Publish Date - 4:26 pm, Fri, 21 June 19
ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా.. రాజస్ధాన్ లో బాలుడు మృతి

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్  కారణంగా మరో చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రాజస్ధాన్ కోటా ప్రాంతంలో జరిగింది. స్ధానికంగా ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడు  టిక్ టాక్ వీడియోలకు ఆకర్షితుడై  తను కూడా ఒక  సెల్ఫీ వీడియో తీయాలకున్నాడు.

తల్లి మంగళ సూత్రాన్ని మెడలో వేసుకుని, గాజులు తొడుక్కుని బాత్ రూమ్ లోకి వెళ్లాడు. అయితే  వీడియో తీసే క్రమంలో బాలుడి మెడలో ఉన్న మంగళసూత్రం  బాత్రూం సందులో ఇరుక్కు పోయింది. దీంతో  మంగళ సూత్రం మెడకు చుట్టుకుపోవడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతకీ లోపలినుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు.
 అయితే అప్పటికే బాలుడు మృతి చెందడంతో  వారు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన తమ చిన్నారి ఇలా హఠాత్తుగా విగత జీవిగా మారడంతో వారి రోదనకు అంతు లేకుండా పోయింది.  ఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.