దేశంలో 84 ఎయిర్‌పోర్టుల్లో ఇకపై ఫుల్ బాడీ స్కానర్లు

దేశంలో 84 ఎయిర్‌పోర్టుల్లో ఇకపై  ఫుల్ బాడీ స్కానర్లు

దేశంలోని 84 విమానాశ్రయాల్లో బాడీ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, సిబ్బంది చేతిలో పట్టుకునే స్కానర్‌ల స్థానంలో బాడీ స్కానర్‌లను తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఏడాదిలోగా వాటిని అమర్చనున్నది. మార్చి 2020 లోపు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ బాడీ స్కానర్లు అమర్చాలని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఎఎస్‌) నిర్ణయించింది. . మిగిలిన విమానాశ్రయాల్లో రెండేళ్లలో బాడీ స్కానర్లను అమర్చనున్నట్లు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 9:28 PM

దేశంలోని 84 విమానాశ్రయాల్లో బాడీ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, సిబ్బంది చేతిలో పట్టుకునే స్కానర్‌ల స్థానంలో బాడీ స్కానర్‌లను తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఏడాదిలోగా వాటిని అమర్చనున్నది. మార్చి 2020 లోపు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ బాడీ స్కానర్లు అమర్చాలని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఎఎస్‌) నిర్ణయించింది. . మిగిలిన విమానాశ్రయాల్లో రెండేళ్లలో బాడీ స్కానర్లను అమర్చనున్నట్లు బిసిఎఎస్‌ తెలిపింది.

డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, స్కానర్‌లు లోహయేతర ఆయుధాలను, పేలుడు పదార్థాలను గుర్తించే స్థితిలో లేవు. అందువల్ల భద్రతా చర్యల్లో భాగంగా బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలని పౌర విమానయాన సంస్ధ నిర్ణయించింది. బాడీ స్కానర్లు లోహ, లోహేతర ఆయుధాలను, పేలుడు పదార్థాలను గుర్తిస్తాయని పౌర విమానయాన భద్రత సంస్థ అధికారులు తెలిపారు. ఇక బాడీ స్కానర్లను వినియోగించే క్రమంలో ఈ 84 విమానాశ్రయాల్లో ప్రామాణిక ఆపరేటింగ్‌ పద్ధతులు పాటించాలని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ సూచించింది.

ఇదిలా ఉంటే దేశంలోని 28 విమానాశ్రయాలను అతి సున్నిత ఎయిర్‌పోర్టులుగా గుర్తించిగా మరో 56 విమానాశ్రయాలను సున్నితమైనవిగా గుర్తించారు. మొదట ఈ 84 విమానాశ్రయాల్లో మార్చి 2020లోపు బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మిగతా ఆపరేషనల్‌ ఎయిర్‌పోర్టుల్లో మార్చి 2021లోపు వీటిని ఏర్పాటు చేయాలని బీసీఏఎస్‌ నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఎయిర్‌పోర్టుల్లో బాడీ స్కానర్ వల్ల ప్రయాణికుల పూర్తి శరీర ఆకృతికి సంబంధించిన చిత్రాలు బయటకు వస్తాయన్న ఆందోళన నెలకొంది. అయితే అలాంటి అనుమానాలు అవసరం లేదని, ఈ యంత్రాల్లో జనరిక్‌ మ్యానెక్విన్‌ను వినియోగిస్తుండడం వల్ల ఇటువంటి చిత్రాలు బయటకు వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబతున్నారు. మరి భద్రతా కారణాల రీత్యా ఫుల్ బాడీ స్కానర్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu