వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత : ఏపీ సీఎం జగన్

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్సార్ చేయూత పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్టుగా చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకంపై అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఈ […]

వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత : ఏపీ సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 9:11 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్సార్ చేయూత పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్టుగా చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకంపై అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించే దిశగా లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు జగన్.

అదేవిధంగా సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల, ఏడు ఐటీడీఏల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అరకు, పాలకొండ, పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రెసిడెన్సియల్ స్కూళ్లు, పాఠశాలల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, స్కూళ్లలో 9 రకాల సౌకర్యాలు మూడు దశల్లో అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.