అంకుషాపూర్ హెచ్‌పిసిఎల్ సమీపంలో కలకలం, మహిళ అనుమానాస్పద మృతి, ఆలస్యంగా వెలుగులోకి.!

రైల్వే ట్రాక్ పక్కన ఒక మహిళ శవమై పడి ఉన్న ఘటన ఘట్కేసర్‌లో కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

అంకుషాపూర్ హెచ్‌పిసిఎల్ సమీపంలో కలకలం, మహిళ అనుమానాస్పద మృతి, ఆలస్యంగా వెలుగులోకి.!
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 05, 2021 | 7:51 AM

రైల్వే ట్రాక్ పక్కన ఒక మహిళ శవమై పడి ఉన్న ఘటన ఘట్కేసర్‌లో కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ గ్రామం హెచ్‌పిసిఎల్ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. డెడ్ బాడీని చూస్తే, మహిళ మృతి చెంది నాలుగైదు రోజులై ఉండొచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ తెల్లవారుజాము వరకూ రైల్వే సిబ్బందిగాని, అటు పోలీసులు గాని గుర్తించకపోవడం విశేషం. మహిళ డెడ్ బాడీ ఘటన తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, ఘట్కేసర్ పోలీసులు స్పాట్ కు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మహిళను రేప్ చేసి చంపారా లేదా వేరే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.