Petrol-Diesel Price Today: పెట్రోల్, డీజిల్ రేట్లు అలానే… హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే…
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో రేట్లలో ఎలాంటి మార్పులు రాలేదు. కాగా, గతంలో డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్....
Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో రేట్లలో ఎలాంటి మార్పులు రాలేదు. కాగా, గతంలో డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఆ తర్వాత నుంచి పెద్ద ధరల పెరుగదల నమోదు కాలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.60 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.82.69 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్ లీటర్ ధర రూ.90.04 కాగా, డీజిల్ ధర రూ.83.10 వద్ద నిలకడగా ఉంది.
Also Read: Gold Price Increased: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాములు ఎంతంటే..