Silver Rate Today : వెండి ధర పెరిగింది… తులంపై రూ.21 పెరుగుదల…. కిలో వెండి ధర రూ.74,100
వెండి ధర అమాంతం పెరిగిపోయింది. కొద్ది రోజులుగా తగ్గుతూ... పెరుగుతూ వస్తున్న వెండి ధర జనవరి 5న ఒక్కసారిగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలో జోషే....
వెండి ధర అమాంతం పెరిగిపోయింది. కొద్ది రోజులుగా తగ్గుతూ… పెరుగుతూ వస్తున్న వెండి ధర జనవరి 5న ఒక్కసారిగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలో జోషే ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. బంగారం, వెండి రెండునూ ఈ వారంలో అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి.
2021లో వెండి ధర తగ్గతూ వచ్చింది. జనవరి 1న 10 గ్రాముల వెండి ధర రూ.724 కాగా… 2న రూ.720గా, జనవరి 3న ధర తగ్గలేదు.. పెరగలేదు… అయితే జనవరి 4న సైతం అదే రేట్ కొనసాగింది. కాగా… నేడు కిలో ధర ఏకంగా రూ.2100 వృద్ధిని నమోదు చేసింది. నేడు తులం వెండి రూ.74.10గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.74.10గా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….
దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.703గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.703గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 741, బెంగళూరులో తులం రూ.696గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 74,100గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.741గా నమోదైంది.
Also Read: National Train Enquiry System: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది.? పూర్తి వివరాలు తెలుసుకోండిలా..!