పీడీఎఫ్ పార్టీ కార్యాలయంపై జాతీయ జెండా…

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూలో పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు...

పీడీఎఫ్ పార్టీ కార్యాలయంపై జాతీయ జెండా...

Hoist The National Flag : జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూలో పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జమ్ము‌క‌శ్మీ‌ర్‌కు ప్రత్యేక ప్రతి‌ప‌త్తిని పున‌రు‌ద్ధ‌రిం‌చేంత వరకు ఎన్ని‌కల్లో పోటీ‌చే‌య‌బో‌మని, జాతీయ జెండాను చేబ‌ట్ట‌బో‌మని మెహ‌బూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్య‌లపై నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

జ‌మ్మూలోని పీడీపీ కార్యాల‌యం ఎదుట బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. పీడీపీ కార్యాల‌యంపై బీజేపీ కార్య‌క‌ర్త‌లు జాతీయ జెండా ఎగుర‌వేశారు. జై భార‌త్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీన‌గ‌ర్‌ వాణిజ్య కేంద్రం లాల్‌చౌక్‌లోని క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర‌వేసేందుకు ముగ్గురు యువ‌కులు ప్ర‌య‌త్నించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.