కరోనా వస్తే సీఎం మమతను కౌగిలించుకుంటానన్న నేతకు పాజిటివ్

కోరుకున్నట్టే బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొత్తగా నియమితుడైన పశ్చిమ బెంగాల్ నేత అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది. ఈ ఉదయం తనకు ఒంట్లో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో హజ్రాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల అనుపమ్ హజ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదానికి కారణమయ్యారు. కరోనా రోగుల బాధలు ఏంటో ముఖ్యమంత్రి మమత తెలుసుకోవాలని.. తనకు కరోనా వస్తే […]

కరోనా వస్తే సీఎం మమతను కౌగిలించుకుంటానన్న నేతకు పాజిటివ్
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2020 | 5:11 PM

కోరుకున్నట్టే బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొత్తగా నియమితుడైన పశ్చిమ బెంగాల్ నేత అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది. ఈ ఉదయం తనకు ఒంట్లో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో హజ్రాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల అనుపమ్ హజ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదానికి కారణమయ్యారు. కరోనా రోగుల బాధలు ఏంటో ముఖ్యమంత్రి మమత తెలుసుకోవాలని.. తనకు కరోనా వస్తే నేరుగా వెళ్లి దీదీని కౌగిలించుకుంటానని హజ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తద్వారా కరోనా రోగుల బాధలు ఎలా ఉంటాయో మమతాబెనర్జీకు తెలిసేలా చేస్తానని హజ్రా అన్నాడు. దాంతో బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. హజ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన సరాసరి చికిత్స కోసం కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు.