ఏపీ బీజేపీకి షాకింగ్ న్యూస్.. వైసీపీలోకి కీలక నేత ఫ్యామిలీ

ఏపీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఉన్న కీలక నేతలే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజులు.. సోమవారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. కాగా.. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:25 am, Mon, 9 December 19
ఏపీ బీజేపీకి షాకింగ్ న్యూస్.. వైసీపీలోకి కీలక నేత ఫ్యామిలీ

ఏపీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఉన్న కీలక నేతలే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజులు.. సోమవారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు.

కాగా.. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అంతేకాదు.. ఏపీ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు తొలినుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ.. కీలక నేతగా ఎదిగారు. అయితే ఇటీవల జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరుతున్నా.. గంగరాజు మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.