ఉత్కంఠ పోరులో రఘునందన్ విజయం, బీజేపీ ఆఫీసులో సంబురాలు
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో అధికార, టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరి ఫైట్ జరిగింది.
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో అధికార, టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరి ఫైట్ జరిగింది. ఈ ఉప ఎన్నికలో చివరకు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ చెందిన సోలిపేట సుజాతపై 1,118 ఓట్లతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన కమలం పార్టీ మధ్యలో కాస్త తడబడినప్పటికీ చివరిలో పుంజుకుని ఫైనల్‌గా విజయాన్ని ముద్దాడింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.
దుబ్బాక విజయం అనంతరం బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ఓటర్లు చైతన్యపరులని కొనియాడారు. బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని చెప్పారు. కాగా, దుబ్బాక సాధించిన విజయాన్ని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం ఇస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
Also Read : దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్