విరాట్‌ కోహ్లీ నిర్ణయంపై నెటిజన్లు గరంగరం

విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.. వ్యక్తిగత విషయాలకు ఇంపార్టెన్స్‌ ఇవ్వడం తప్పేమీ కాకపోయినా , జట్టు ప్రయోజనాల గురించి కూడా కాసింత ఆలోచించాలని కోహ్లీకి సలహా ఇస్తున్నారు. రంజీట్రోఫీ ఆడుతున్నప్పుడు తండ్రి చనిపోయినప్పటికీ బాధను దిగమింగుకుని ఆడి జట్టును గెలిపించిన ఆటగాడేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆసీస్‌ టూర్‌లో కోహ్లీ లాంటి ఆటగాడు లేకపోతే రిజల్ట్స్‌ మరో రకంగా ఉంటాయని అంటున్నారు. దీనికంతటికీ కారణం కోహ్లీ పెటర్నటీ లీవ్‌ కోసం అప్లయి చేయడం, […]

విరాట్‌ కోహ్లీ నిర్ణయంపై నెటిజన్లు గరంగరం
Follow us
Balu

|

Updated on: Nov 10, 2020 | 4:08 PM

విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.. వ్యక్తిగత విషయాలకు ఇంపార్టెన్స్‌ ఇవ్వడం తప్పేమీ కాకపోయినా , జట్టు ప్రయోజనాల గురించి కూడా కాసింత ఆలోచించాలని కోహ్లీకి సలహా ఇస్తున్నారు. రంజీట్రోఫీ ఆడుతున్నప్పుడు తండ్రి చనిపోయినప్పటికీ బాధను దిగమింగుకుని ఆడి జట్టును గెలిపించిన ఆటగాడేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆసీస్‌ టూర్‌లో కోహ్లీ లాంటి ఆటగాడు లేకపోతే రిజల్ట్స్‌ మరో రకంగా ఉంటాయని అంటున్నారు. దీనికంతటికీ కారణం కోహ్లీ పెటర్నటీ లీవ్‌ కోసం అప్లయి చేయడం, బీసీసీఐ దాన్ని మన్నించి సెలవు మంజూరు చేయడం.. టీమిండియా మాజీ కెప్టన్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో కోహ్లీని పోలుస్తున్నారు కొంందరు నెటిజన్లు.. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లీ ప్రాధానత్య ఇస్తున్నాడని మండిపడుతున్నారు. తన కూతురు జన్మించిన సమయంలో ధోనీ భార్యాపిల్లలను వదిలి జట్టును ముందకు నడిపించారంటూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2015 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌ జరుగుతున్నప్పుడే ధోనీ భార్య సాక్షికి డెలివరీ అయ్యింది. జీవాకు జన్మనిచ్చింది.. ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్‌ వార్మప్‌ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి ఆరున జీవా జన్మించింది.. ఆ సమయంలో భార్య చెంతన ఉండకపోవడం వల్లే మీరు జీవాకు సంబంధించిన మధుర స్మృతులకు దూరమవుతున్నారా అని అడిగితే.. ప్రస్తుతం తాను దేశం తరఫున నేషనల్‌ టీమ్‌ను లీడ్‌ చేసే బాధ్యతాయుతమైన పనిలో ఉన్నానని, ఇతర విషయాల గురించి ఆలోచించడం లేదని ధోనీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా బోగ్లే మాత్రం కోహ్లీని నొప్పించకుండా కామెంట్స్‌ చేశాడు.. ఆధునిక ఆటగాళ్లకు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ కూడా ఇంపార్టెంటేనన్నాడు. కోహ్లీ లేకపోతే టీమిండియా చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పాడు..