అదే హవా ! బీహార్ లో దూసుకువెళ్తున్న బీజేపీ
బీహార్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఈ పార్టీ 129 సీట్లలో లీడ్ లో ఉండగా, ఆర్జేడీ 104 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 10 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 73, జేడీ-యూ 50, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 66, కాంగ్రెస్ 20, ఎల్ జేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, టాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఈ యంత్రాల్లో […]
బీహార్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఈ పార్టీ 129 సీట్లలో లీడ్ లో ఉండగా, ఆర్జేడీ 104 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 10 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 73, జేడీ-యూ 50, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 66, కాంగ్రెస్ 20, ఎల్ జేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, టాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఈ యంత్రాల్లో ఎలాంటి లోపమూ లేదని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఓట్ల లెక్కింపు కొంత మందకొడిగా సాగుతోందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులను వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే పరిమితం చేయవలసి వచ్చిందని పేర్కొంది.