Bird flu outbreak : దేశంలో పంజా విసురుతోన్న బర్డ్ ఫ్లూ, మరో మూడు రాష్ట్రాల్లో కేసులు బయటపడ్డంతో 10కి చేరిన సంఖ్య
దేశంలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. పక్షి వైరస్ బారిన పడుతున్న రాష్ట్రాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ మరో మూడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు..
దేశంలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. పక్షి వైరస్ బారిన పడుతున్న రాష్ట్రాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ మరో మూడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ కూ పాకింది బర్డ్ ఫ్లూ. దీంతో 10కి చేరింది బర్డ్ ఫ్లూ బాధిత రాష్ట్రాల సంఖ్య. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ పక్షి వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. బర్డ్ ఫ్లూ బారిన పడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేసింది కేంద్రం. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ కోళ్లు, బాతులు, పక్షులు మృత్యువాత పడిన శాంపిళ్లను ల్యాబ్‌లకు అధికారులు పంపించగా, బర్డ్ ఫ్లూ లేదని నివేదిక వచ్చింది.