Chiru Father Venkata Rao Acted:మామగారితోనే కాదు తండ్రి తోనూ సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మెగాస్టార్.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తన మామగారైన అల్లు రామలింగయ్య తో అనేక సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే చిరంజీవి తన తండ్రి వెంకటరావు కలిసి ఒక సినిమాలో నటించారు.. ఐతే ఇద్దరూ కలిసి ఒకే సీన్ ను షేర్ చేసుకోకపోయినా..
Chiru Father Venkata Rao Acted: కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో తండ్రి కామియో చేయడం .. ఆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకుని రావడం మనకు తెలిసిందే.. బాలీవుడ్ లో అమితాబ్ తన కొడుకు అభిషేక్ నటించిన మూవీలో ఓ చిన్న పాత్రలో నటించడమే కాదు ఆడిపాడారు కూడా.. ఇక తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తనయుడు నటించిన మగధీర, బ్రూస్ లీ వంటి సినిమాల్లో తళుక్కున మెరసి ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
పునాది రాళ్లతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి మొదట్లోనే స్టార్ హీరో అవ్వలేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.. విలన్ గా, ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. ఈరోజు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఆయనకు కూడా నటన అంటే ఇష్టమని తన కొడుకు చిరంజీవి ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే అయన ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1969 లో విడుదలైన జగత్ కిలాడీ సినిమాలో వెంకట్రావు చిన్న పాత్ర చేశారు. ఆరడుగుల ఎత్తు, ఆకట్టుకునే అందంతో ఉన్న ఆయనకి మరిన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.. అయితే మధ్యతరగతి కుటుంబం.. బాధ్యతలు నెరవేర్చడానికి తప్పని సరిగా ఉద్యోగం చేయాల్సి రావడంతో నటనపై మక్కువను పక్కన పెట్టారు.
తన కోరిక తన పెద్దకొడుకు తీరుస్తున్నాడని అయన సంబరపడేవారట. అంతేకాదు.. చిరంజీవి హీరోగా నటించిన ఒక సినిమాలో వెంకట రావు కూడా నటించారు. కొడుకుతో పాటు స్క్రీన్‌షేర్ చేసుకున్నారు.ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు ఏమి ఉండవు మినిస్టర్ పాత్రలో కాసేపు కనిపిస్తారు. ఆ సినిమానే సూపర్ హిట్ మూవీ ఖైదీ తరువాత రిలీజైన మంత్రి గారి వియ్యంకుడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంత్రి పాత్ర కి సూట్అయ్యే నటుడి కోసం చాలా మందికి స్క్రీన్ టెస్ట్ చేసారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లు రామలింగయ్య వెంటనే బాపు దగ్గరికి వెళ్లి వెంకటరావు పేరు చెప్పారట దానికి బాపు అంగీకరించారు. అలా ఈ సినిమాలో మంత్రి పాత్రలో వెంకట్‌రావు నటించారు. అల్లు రామలింగయ్య ఇంట్లోకి వెళ్లే సమయంలో ఇంటి బయట ఉన్నపేరు బోర్డు లో కే.వెంకట రావు మినిస్టర్ అని రాసి ఉన్నటు చూపించారు. తన కొడుకు చిరంజీవి తో కలిసి నటించే సన్నివేశాలు లేకపోయినా ఒకే సినిమాలో నటించాం అనే తృప్తి మాత్రం వెంకట రావుకి లభించింది. అయితే చిరు తన మామగారైన అల్లు రామలింగయ్య తో అనేక సినిమాల్లో నటించారన్న సంగతి తెలిసిందే.
Also Read: పేదవాడు కోటీశ్వరుడైతే ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పిన ఏడంతస్తుల మూవీకి 40 ఏళ్ళు