Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yedanthasthula Meda 40 Years: పేదవాడు కోటీశ్వరుడైతే ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పిన ఏడంతస్తుల మూవీకి 40 ఏళ్ళు

ఓ గొప్పింటి అమ్మాయి ఓ పేదింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే... తనను నమ్మి ఆస్తులు అంతస్తులు వదిలి పూరి గుడిసెకు వచ్చింది కనుక ఆ అమ్మాయిని పుట్టింటి కంటే గొప్పగా చూసుకోవాలని భావించి.. ఆ అబ్బాయి ఆర్ధికంగా...

Yedanthasthula Meda 40 Years: పేదవాడు కోటీశ్వరుడైతే ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పిన ఏడంతస్తుల మూవీకి 40 ఏళ్ళు
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2021 | 4:53 PM

Yedanthasthula Meda 40 Years: ఓ గొప్పింటి అమ్మాయి ఓ పేదింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే… తనను నమ్మి ఆస్తులు అంతస్తులు వదిలి పూరి గుడిసెకు వచ్చింది కనుక ఆ అమ్మాయిని పుట్టింటి కంటే గొప్పగా చూసుకోవాలని భావించి.. ఆ అబ్బాయి ఆర్ధికంగా ఎదగడానికి 24 గంటలు కష్టపడుతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను డబ్బు సంపాదనలో పడి నిర్లక్ష్యం చేస్తాడు. దాని పర్యవసానం ప్రేమకోసం అన్ని వదులుకుని వచ్చిన ఆ అమ్మాయి ప్రేమకు దూరమై మానసిక వ్యాధితో ఓ పిల్లవాడు పుట్టిన తర్వాత మరణిస్తుంది. డబ్బు సంపాదనలో పడి తాను ఏమి కోల్పోయాడో అప్పటివరకూ అతని తెలియదు. ఇది దర్శక రత్న దాసరి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కాంబోలో తెరకెక్కిన ఏడంతస్తుల మేడ మూవీ. ప్రేమ పెళ్లి, అవసరానికి మించి డబ్బు సంపాదన అనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజై నేటితో నలభై ఏళ్ళు పూర్తి.

దాసరి, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తండ్రీకొడుకులుగా ఏఎన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 50 రోజులకే ఒక కోటీ ఇరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. హీరోయిన్లు సుజాత, జయసుధ పోటీపడి నటించి మహిళా ప్రేక్షకులను మెప్పించారు.ఈ సినిమాను మహిళలు కోసం ప్రత్యేక షోలు ప్రదర్శించే వారంటే అప్పట్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏమిటో తెలుస్తోంది. పేదవాడు కోటీశ్వరుడైతే ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చాటిచెబుతూ దర్శకరత్న అద్భుతంగా తెరపై మానవీయ విలువల్ని ఆవిష్కరించారు. ఆ రోజుల్లో కాశ్మీర్‌లో పాటలు షూట్ చేసిన మొదటి సినిమా ఇదే.. ఇందులోని ప్రతి పాట సూపర్ హిట్. ఇక టైటిల్ సాంగ్ ఇప్పటికీ ఆల్బమ్‌లో ప్లే అవుతూనే ఉంది. అప్పటి వరకూ అక్కినేని వరస ప్లాప్స్‌తో సతమతవుతున్నారు. ఆ సమయంలో ఈ సినిమా రిలీజై అయన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది.

ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా.. అక్కినేని నాగార్జున తో రీమేక్ చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదని సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ చెప్పారు. అంతేకాదు దాసరి నారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అయన ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అంటే…చిన్న పాయింట్ దొరికితే చాలు కథ అద్భుతంగా అల్లేస్తారు. ఆయనతో సినిమా చేయడం నిజంగా గొప్ప అనుభవం. ఈ సినిమా అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ ఆ క్షణాలు తన కళ్లముందు తిరుగుతాయని అన్నారు. ఇప్పుడు అంతా మారిపోయింది. అలాంటి నటులు, మనుషులు ఇప్పట్లో కనిపించరు.. అప్పుడు షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళమని గుర్తుచేసుకున్నారు.

Also Read: సుశాంత్ నీవు మరణించి మరో నెల గడిచిపోతుంది, న్యాయం జరుగుతుందేమో ఎదురుచూస్తున్నాం