Shekhar Suman on Sushant Suicide: సుశాంత్ నీవు మరణించి మరో నెల గడిచిపోతుంది, న్యాయం జరుగుతుందేమో ఎదురుచూస్తున్నాం
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది జూన్ 14 న ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన మరణించిన ఈ నెల 14 తేదీకి ఏడు నెలలు పూర్తి...

Shekhar Suman on Sushant Suicide:బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది జూన్ 14 న ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన మరణించిన ఈ నెల 14 తేదీకి ఏడు నెలలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ ను నటుడు శేఖర్ సుమన్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నాడు.. నీవు మరణించి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా కేసు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. ప్రతి నెల 14 తేదీ వస్తుంది.మరో నెల గడిచిపోతుంది.. కానీ నీకు న్యాయం జరుగుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాం అంటూ జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. సీబీఐ ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయాలఐ సుశాంత్ కు న్యాయం చేయాలి కోరుతూ శేఖర్ సుమన్ సోషల్ మీడియా ద్వారా కోరారు.
ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో మహేంద్రసింగ్ గా నటించిన సుశాంత్ సింగ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: టాలీవుడ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ..