Master Movie : విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ ‘మాస్టర్’.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..
దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన..

Master Movie : దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా కారణంగా చాలా నష్టపోయామని, ‘మాస్టర్’ లాంటి పెద్ద సినిమా విడుదలతో ఆ నష్టం కాస్తయినా తగ్గుతుందని థియేటర్స్ యాజమాన్యం భావిస్తుంది.
దాంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతి తెచ్చుకుంది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి విపక్షాలతోపాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది దీని పై కోర్టును కూడా ఆశ్రయించారు. దాంతో 100శాతం ఆక్యూపెన్సీ ఇవ్వవద్దని కోర్టు ఆదేశించింది. ఇక కేంద్రం కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఈ సినిమా విడుదలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఏ కొత్త సినిమా విడుదలైన ఒక్క రోజులోనే పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే. ‘మాస్టర్’ సినిమా అలా పైరసీ అవ్వకుండా చర్యలు తీసుకొవాలని కోర్టును ఆశ్రయించారు చిత్ర మేకర్స్. దాంతో కీలక ఆదేశాలను జారీ చేసింది కోర్టు. మాస్టర్ మూవీని ప్రదర్శించొద్దని దాదాపు 400లకు పైగా పైరసీ సైట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతోపాటు మొబైల్ నెట్‌వర్క్ సంస్థలను కూడా కోర్టు ఆదేశించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Taapsee Pannu : ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేవని భయపెట్టారు.. కానీ నేను పట్టించుకోలేదు..
Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క