Actress Taapsee Pannu : ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేవని భయపెట్టారు.. కానీ నేను పట్టించుకోలేదు..
'ఝుమ్మందినాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నది తాప్సీ. ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ సాదించింది.

Actress Taapsee Pannu ‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నది తాప్సీ. ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ సాదించింది. ఆతర్వాత తాప్సీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ లేడీఓరియంటెడ్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే ప్రయోగాత్మక చిత్రలతోనూ మెప్పిస్తుంది తాప్సీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
ఇక ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ… తన కెరియర్లో ఎదురైన అనుభవాలను పంచుకుంది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు గ్లామర్ పాత్రలో ఎక్కువగా చేశా. అలాంటి పాత్రలు చేస్తేనే తొందరగా గుర్తింపు వస్తుందని అప్పుడు అనుకునేదాన్ని కానీ నేను అనుకున్న పేరు రాలేదు. గ్లామర్ ను నమ్ముకొని చేసిన సినిమాలు నాకు సంతృప్తిని ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. గ్లామర్ పాత్రల్లో నటించడంకంటే నా మనసుకు సంతోషాన్ని కలిగించే సినిమాల్లో నటించడం మంచిదనిపించింది. అలాంటి కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాను. కానీ నా నిర్ణయం సరైనది కాదు అని చాలా మంది నన్ను విమర్శించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేవని అన్నారు. హీరోల సరసన నటించే అవకాశాలు రావని అన్నారు. కానీ నేను ఆ మాటలను పట్టించుకోకుండా నా జర్నీని కొనసాగిస్తున్నా అదే నన్ను ఇప్పుడు ఈ స్తాయిలో ఉంచింది అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Sarileru Neekevvaru Movie : మహేష్ బ్లాక్‌బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఏడాది పూర్తి..