AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu: చైనాలో మరో వైరస్.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి గుర్తింపు.. పెద్ద ప్రమాదకారి కాదన్న అధికారులు!

Bird Flu: ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచం అల్లకల్లోలంగా మారిపోయింది. మొదటి వేవ్.. రెండో వేవ్.. మూడో వేవ్ అంటూ గ్యాప్ ఇచ్చి మరీ కరోనా విశృంఖలంగా వ్యాపిస్తూనే ఉంది.

Bird Flu: చైనాలో మరో వైరస్.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి గుర్తింపు.. పెద్ద ప్రమాదకారి కాదన్న అధికారులు!
Bird Flu
KVD Varma
|

Updated on: Jun 01, 2021 | 3:32 PM

Share

Bird Flu: ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచం అల్లకల్లోలంగా మారిపోయింది. మొదటి వేవ్.. రెండో వేవ్.. మూడో వేవ్ అంటూ గ్యాప్ ఇచ్చి మరీ కరోనా విశృంఖలంగా వ్యాపిస్తూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ ఒక పక్క అందుబాటులోకి వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ కరోనా పై పూర్తి స్థాయిలో పరిశోధనలు పూర్తికాలేదు. అదేవిధంగా పూర్తిగా ఈ వైరస్ గురించి స్పష్టపడలేదు. ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నా కోవిడ్ 19 వైరస్ ను పరిశోధనలు చేస్తూనే.. దాని గురించి వివరాలు చెప్పుకుంటూ వస్తున్నారు పరిశోధకులు. ఇదిలా ఉంటె మళ్ళీ చైనాలో కొత్తగా ఒక వైరస్ సంక్రమణ వెలుగులోకి వచ్చింది.

చైనా తూర్పు జియాంగ్సు ప్రావిన్స్ నుండి హెచ్ 10 ఎన్ 3 బర్డ్ ఫ్లూ ఒక మనిషికి సోకినట్లుగా గుర్తించారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. జెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకిందని నిర్ధారించారు. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడనీ, అతనికి వైద్య సహాయం అందుతోందనీ చైనా ప్రభుత్వ సిజిటిఎన్ టివి తెలిపింది. ఇటువంటి బర్డ్ ఫ్లూ అప్పుడపుడు పౌల్ట్రీల నుంచి మానవులకు సంక్రమిస్తుందని అక్కడి ఆరోగ్య అధికారులు చెప్పారు. అదేవిధంగా ఇది వేగంగా విస్తరించే అవకాశం లేదన్నారు. మహమ్మారిలా ఇది విరుచుకుపడే ప్రమాదం చాలా తక్కువ అని వారు తెలిపారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసులో రోగికి మే 28 న హెచ్ 10 ఎన్ 3 ఏవియన్ ఇంఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు వివరిస్తూ ఒక ప్రకటన చేసింది.

ఇప్పటివరకూ హెచ్ 10 ఎన్ 3 తో ​మానవ సంక్రమణకు సంబంధించిన ఇతర కేసులు ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా నమోదు కాలేదు. H10N3 అనేది పౌల్ట్రీలో వైరస్ యొక్క తక్కువ వ్యాధికారక లేదా తక్కువ తీవ్రమైన జాతిగా అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువ. చైనాలో ఏవియన్ ఇంఫ్లుఎంజా యొక్క అనేక జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదుగా ప్రజలకు సోకుతాయి, సాధారణంగా పౌల్ట్రీతో పనిచేసేవారు వీటిబారిన పడే అవకాశం ఉంటుంది. H5N8 అనేది ఇంఫ్లుఎంజా A వైరస్ యొక్క ఉప రకం (దీనిని బర్డ్ ఫ్లూ వైరస్ అని కూడా పిలుస్తారు). H5N8 మానవులకు తక్కువ ప్రమాదాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇది అడవి పక్షులు అలాగే పౌల్ట్రీలకు చాలా ప్రాణాంతకంగా చెబుతారు.

Also Read: WORLD MILK DAY-2021: నేడు ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి..

Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్