AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్

బీహార్‌లో తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దాదాపు 2 కోట్లకు మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 243 స్థానాలకు గానూ మొదటి విడతగా 71 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా వెయ్యి నుంచి 16 వందల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు దాటిన […]

కాసేపట్లో బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్
Venkata Narayana
|

Updated on: Oct 28, 2020 | 6:48 AM

Share

బీహార్‌లో తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దాదాపు 2 కోట్లకు మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 243 స్థానాలకు గానూ మొదటి విడతగా 71 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా వెయ్యి నుంచి 16 వందల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈవీఎంలన్నింటినీ ఇప్పటికే శానిటైజేషన్‌ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. బీహార్‌ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 71 స్థానాలకు గానూ 952 మంది పురుషులు, 114 మంది మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యధికంగా గయ శాసనసభ స్థానానికి 27 మంది బరిలో నిలవగా.. అత్యల్పంగా బంకా జిల్లాలోని కటోరియా స్థానానికి ఐదుగురు పోటీ చేస్తున్నారు.

Follow Us