కాసుల వేటతో నాలుగో కెప్టెన్‌గా కుమార్‌ సాయి

టాస్క్‌లో నలుగురు పోటీపడి మరీ రెచ్చిపోయారు. ఈ టాస్క్ లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్‌ సాయి బిగ్‌బాస్‌ హౌజ్ కి నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.

కాసుల వేటతో నాలుగో కెప్టెన్‌గా కుమార్‌ సాయి
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2020 | 11:52 AM

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అదే జోరును కనబరుస్తుంది. విభిన్నమైన టాస్క్‌లతో కావాల్సినంత ప్రేక్షకులకు ఫుల్ జోష్ ని ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ పోరు రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న నలుగురు కాసుల వేట టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హరిక, సుజాతలు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఇందులో భాగంగా గార్డెనింగ్‌ ఏరియాలో మట్టితో బురద తొట్టి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లను తీసి నాలుగు కోసం ఏర్పాటు చేసిన బాస్కెట్ లో వేయాలని సూచించారు. టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారిని ఇంటి కెప్టెన్‌ అవుతారని బిగ్‌బాస్‌ స్పష్టం చేశారు. ఈ టాస్క్‌ సంచాలకులుగా సోహైల్‌ ఉండాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో నలుగురు పోటీపడి మరీ రెచ్చిపోయారు.ఈ టాస్క్ లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్‌ సాయి బిగ్‌బాస్‌ హౌజ్ కి నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్‌ బ్యాండ్‌ను ధరించాడు. అనంతరం అందరు కలిసి గార్డెన్‌లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు.