AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బారిన పడ్డ 20 వేల మంది అమెజాన్‌ ఉద్యోగులు

కరోనా వైరస్‌ తమ ఉద్యోగులకు సోకకుండా ఉండేందుకు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.. అయినప్పటికీ ఆ వైరస్‌ బారిన సుమారు 20 వేల మంది ఉద్యోగులు పడ్డారు..

కరోనా బారిన పడ్డ 20 వేల మంది అమెజాన్‌ ఉద్యోగులు
Balu
|

Updated on: Oct 02, 2020 | 11:36 AM

Share

కరోనా వైరస్‌ తమ ఉద్యోగులకు సోకకుండా ఉండేందుకు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.. అయినప్పటికీ ఆ వైరస్‌ బారిన సుమారు 20 వేల మంది ఉద్యోగులు పడ్డారు.. ఈ విషయాన్ని అమెజాన్‌ సంస్థే ప్రకటించింది.. అయితే అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కరోనా పాజిటివ్‌ల రేటు తక్కువే! 1.37 మిలియన్‌ల ఫ్రంట్‌లైన్ కార్మికులతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు.. దాదాపు 650 సైట్ల ద్వారా రోజుకు 50 వేల కరోనా పరీక్షలను అమెజాన్‌ నిర్వహించింది.. కరోనా పట్ల ఉద్యోగులను అప్రమత్తం చేయడానికి అమెజాన్‌ ఎంతో కష్టపడింది.. ఎప్పుడైతే కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంది అమెజాన్‌ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్‌లలోని ఉద్యోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంది.. నమోదైన ప్రతి కొత్త కేసును తెలుసుకుంది.. హోల్‌ ఫుడ్స్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగుల రేటు అమెరికా జనాభాకు సమానంగా ఉంటుంది.. ఇందులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 వేలు ఉండవచ్చని అమెజాన్‌ తెలిపింది. ఇంత చేస్తున్నా తమపై కొందరు విమర్శలు చేస్తున్నారని అమెజాన్‌ తెలిపింది.. కరోనా సోకిన కొంతమంది తమ ఉద్యోగులు వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదని అమెజాన్‌ పేర్కొంది.. మొత్తంగా ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో అమెజాన్‌ చాలా శ్రద్ధ తీసుకుంటోంది..

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు