బిగ్ బాస్ కొత్త హోస్టుగా సమంతా.. ఈ వారం నో ఎలిమినేషన్..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. హోస్టు అక్కినేని నాగార్జున స్థానంలో అక్కినేని కోడలు, హీరోయిన్ సమంతా సందడి

బిగ్ బాస్ కొత్త హోస్టుగా సమంతా.. ఈ వారం నో ఎలిమినేషన్..!
Ravi Kiran

|

Oct 24, 2020 | 9:59 PM

Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. హోస్టు అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం మనాలీకి వెళ్లడంతో.. ఆయన స్థానంలో ఈ వీకెండ్ హోస్టుగా అక్కినేని కోడలు, హీరోయిన్ సమంతా సందడి చేయబోతోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా బిగ్ బాస్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితమే ఇచ్చింది.

దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ రేపు(అక్టోబర్ 25) సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కానుంది. ఇందులో హీరోయిన్ సమంతా సందడి చేయనుంది. ‘ఈ వారం నాతో ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదు” అనే సామ్ డైలాగ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీనితో అటు బుల్లితెర ప్రేక్షకులు.. ఇటు అక్కినేని అభిమానులు సమంతా హోస్టింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే సమంతా కేవలం రెండు ఎపిసోడ్స్‌కు మాత్రమే హోస్టుగా వ్యవహరిస్తుందని సమాచారం. అందుకే ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చునని టాక్. కాగా, ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu