మోనాల్-అభిజిత్‌ల మధ్య అఖిల్ రాయబారం.. వర్క్‌వుట్ అయ్యేనా.!

బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకూ హీట్ ఎక్కుతున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ వస్తే చాలు.. హౌస్‌మేట్స్‌లోని ఎవరొకరు అభిజిత్-మోనాల్ టాపిక్‌ను

మోనాల్-అభిజిత్‌ల మధ్య అఖిల్ రాయబారం.. వర్క్‌వుట్ అయ్యేనా.!
Ravi Kiran

|

Oct 27, 2020 | 4:40 PM

Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకూ హీట్ ఎక్కుతున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ వస్తే చాలు.. హౌస్‌మేట్స్‌లోని ఎవరొకరు అభిజిత్-మోనాల్ టాపిక్‌ను తీసుకురావడం.. మధ్యలో అఖిల్‌ను దూర్చడం అలవాటుగా మారిపోయింది. సరిగ్గా మూడు వారాల కిందట మోనాల్ విషయంలో స్ట్రెయిట్‌గా అభిజిత్-అఖిల్‌లు కొట్టుకుంటే.. ఈ వారం అమ్మ రాజశేఖర్ అభిజిత్-మోనాల్ టాపిక్‌ను తీసుకొచ్చి రచ్చ లేపాడు.

అభిజిత్-మోనాల్.. ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం లేదని నీకు తెలుసు. నువ్వు మోనాల్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావ్. ఒక్కసారి కూడా వారిద్దరిని ఒకటి చేద్దాం అని చూడలేదు. అభిజిత్‌కు ఆమె దూరంగా ఉంటే.. నువ్వు మాత్రం అభితో మాట్లాడుతున్నావ్. ఇది ఎంతవరకు న్యాయం” అని మాస్టర్ అఖిల్‌ను సిల్లీ పాయింట్‌పై నామినేట్ చేశాడు. దీనికి అఖిల్ కూడా స్పందిస్తూ.. తాను ఎప్పుడూ అభిజిత్‌తో మాట్లాడొద్దని మోనాల్‌కు చెప్పలేదని.. అది వారిష్టానికే వదిలేశానని చెబుతాడు.

అటు అభిజిత్ కూడా మోనాల్‌ను నామినేట్ చేస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనను లేవనెత్తాడు. తనను మ్యానుపులేటర్ అని అనడం.. దాని గురించి వేరేవాళ్ల దగ్గర చెప్పడం తనకు నచ్చలేదని చెప్పుకొస్తాడు. ఈ ఎనిమిది వారాల్లో అసలు నిన్ను ఎప్పుడూ నామినేట్ చేయాలని అనుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఆ రీజన్‌‌పైనే నామినేట్ చేస్తున్నట్లు అభిజిత్ మోనాల్‌కు చెబుతాడు. ఇక ప్రతీసారి నామినేషన్ ప్రక్రియలోకి తన టాపిక్‌ను తీసుకొస్తుండటంతో మోనాల్ మరోసారి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఆమె బాధను చూడలేని అఖిల్.. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లెమ్‌కు ఓ ఆన్సర్ రాలేదని.. వెళ్లి అభితో మాట్లాడమని సలహా ఇస్తాడు. ఎన్నిసార్లు మాట్లాడాలి.. నేను అలిసిపోయాయని మోనాల్ కంటతడి పెట్టుకోవడంతో అఖిల్ బుజ్జగిస్తాడు. పోనీ.? నేను వెళ్లి మాట్లాడనా అభిజిత్‌తో.? అని ఆమె అనుమతి తీసుకుని చర్చిస్తాడు. మరి అభిజిత్-మోనాల్ మధ్య అఖిల్ రాయబారం ఎంతవరకు వర్క్‌వుట్ వేచి చూడాలి..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu