Girl Friends: అబ్బాయిలూ మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా.. అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే
మనుషులుగా సమాజంలో మనకెన్నో బంధాలు. మరెందరితో పరిచయాలు. పుట్టినప్పటి నుంచి గిట్టేవరకు ఎంతో మందితో మనకు స్నేహం ఏర్పడుతుంది. వీరిలో మనకంటే పెద్దవారు ఉండొచ్చు. చిన్నవారూ ఉండొచ్చు....
మనుషులుగా సమాజంలో మనకెన్నో బంధాలు. మరెందరితో పరిచయాలు. పుట్టినప్పటి నుంచి గిట్టేవరకు ఎంతో మందితో మనకు స్నేహం ఏర్పడుతుంది. వీరిలో మనకంటే పెద్దవారు ఉండొచ్చు. చిన్నవారూ ఉండొచ్చు. ఎన్ని పరిచయాలు ఉన్నా వాటిలో కొన్ని మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. అయితే మగాడి జీవితంలో ఆడవాళ్ల పాత్ర చాలా ముఖ్యం. బాధలో ఓదార్పుగా, సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ, అవసరమైనప్పుడు సలహాలిస్తూ, ట్రాక్ తప్పినవాడిని దారిలో పెడుతూ, ప్రతి విషయంలో తోడుగా నిలుస్తుంది. అందుకే వారు లేని స్నేహాన్ని ఊహించుకోలేం. అబ్బాయిలు దూకుడుగా వ్యవహరిస్తే సమస్య పరిష్కారమయ్యే ఉపాయం అమ్మాయిలు ఆలోచిస్తారు. కష్టం ఎక్కువైతే భుజంపై చోటిచ్చి ఓదారుస్తారు. మనసుకి నచ్చే మాట చెబితే చిన్న హగ్ ఇచ్చి సంతోషం రెట్టింపు చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పే కాదు సంతోషాలు, సరదాలు కావాలనుకున్నప్పుడూ వెనువెంటనే దొరికేది వాళ్ల దగ్గరే. డిన్నర్ కి వెళ్లడం, కెఫేకు వెళ్లడం వంటివి అబ్బాయిన ఆనందాన్ని ఎన్నో రెట్లు పెంచుతాయి.
ఒకమ్మాయి మనసు ఎలా ఉంటుందో, ఎలా ఆలోచిస్తుందో మరో అమ్మాయికే అర్థమవుతుంది. ప్రేమ, పెళ్లి విషయంలో నిరభ్యంతరంగా వాళ్ల సలహాలు తీసుకోవచ్చు. ఓ ఫ్రెండో, ప్రేమికురాలో ఉంటే అబ్బాయిలకు ఆసలు షాపింగ్ సమస్యే ఉండదు. ఆచితూచి కొనడంలో అమ్మాయిల్ని మించిన వారు ఎవరూ ఉండరు కదా..! గొడవలు, వివాదాలప్పుడు ఆలోచన లేని దుందుడుకుతనం అబ్బాయిలది. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల్లో ఇరుక్కుపోతుంటారు. అలాంటి సమయంలో సైడ్ ట్రాక్ పట్టినవాళ్లని వెనక్కిలాగి సరైన దారిలో పెట్టేది అమ్మాయిలే. అబ్బాయి నచ్చాలే గానీ అమ్మలా, సోదరిలా ప్రేమను కురిపిస్తారు. తోచినంత సాయం చేస్తుంటారు. కుర్రాళ్ల రహస్యాలు దాస్తారు. జీవితంలో ఎదిగేలా ప్రేరణ కలిగిస్తారు.
Also Read
Health Tips: ఈ 5 పదార్థాలతో కలిపి తేనెను తీసుకుంటున్నారా.. చాలా ప్రమాదకరం.. అవేంటో తెలుసా?
Save Wisely: ఎంత సంపాదించినా మీరు డబ్బు ఆదా చేయలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..