AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. ఇప్పటివరకు సుమారు 187 మ్యాచులు ఆడిన ముంబై.. 107 విజయాలు సాధించి 57.75 శాతం విన్నింగ్ స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతోంది.

ముంబైను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
Ravi Kiran
|

Updated on: Sep 10, 2020 | 5:20 PM

Share

Mumbai Indians In IPL 2020: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. ఇప్పటివరకు సుమారు 187 మ్యాచులు ఆడిన ముంబై.. 107 విజయాలు సాధించి 57.75 శాతం విన్నింగ్ స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతోంది. రోహిత్ శర్మ సారధ్యంలో బలమైన లైనప్ ఉన్న ఈ జట్టు.. మిగిలిన ఫ్రాంచైజీలకు గట్టి పోటీని ఇస్తుంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్య, క్రిస్ లిన్, పొలార్డ్‌లతో బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాండ్య సోదరులు, రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్‌ ముంబై జట్టు సొంతం. ముఖ్యంగా బుమ్రా డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు.

కానీ ఇప్పుడు ఈ జట్టును ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2013 నుంచి 2019 వరకు ముంబై జట్టు పడుతూ లేస్తూ వచ్చింది. 2013లో ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ముంబై.. 2014లో ప్లేఆఫ్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2015లో టైటిల్ కొట్టినా.. 2016లో ప్లేఆఫ్‌కు చేరలేదు. ఇక 2017లో మళ్లీ కప్ కొట్టిన రోహిత్ సేన.. 2018లో లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. కాగా, 2019లో టైటిల్ సాధించిన ముంబై.. మరి ఈ ఏడాది అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందా.. లేక చరిత్రను తిరగరాస్తుందా అనేది చూడాలి.?

Also Read: IPL 2020: తొలి మ్యాచ్‌లు మిస్ కానున్న స్టార్ ప్లేయర్స్ వీళ్లే.!

ముంబై టీం: రోహిత్ శర్మ, సౌరభ్ తివారీ, క్రిస్ లిన్, అన్మోల్ ప్రీత్ సింగ్, సుర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, కిరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, రూతర్‌ఫోర్డ్‌, అంకుల్ రాయ్, బల్వంత్ రాయ్, క్వింటన్ డికాక్, ఆదిత్య తారే, ఇషాన్ కిషన్, దిగ్విజయ్ దేశ్ముఖ్, బుమ్రా, పాటిన్సన్, రాహుల్ చాహర్, మొహసిన్ ఖాన్, మెక్‌లెగన్‌, దావల్ కులకర్ణి, ట్రెంట్ బౌల్ట్, జయంత్ యాదవ్, కౌంటర్ నైల్

Follow Us
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఎముకల బలానికి సంజీవని నల్లేరు..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు
ఎముకల బలానికి సంజీవని నల్లేరు..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు
దారుణం.. బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది
దారుణం.. బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.
మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం
మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం
ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..?
ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..?
వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు
వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు
వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర
వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర
దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌!
దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌!