బ్రేకింగ్: బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ లభ్యం

ఏడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవి శేఖర్ ఆమెను వదిలివెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆమెను అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మరోవైపు రవి శేఖర్‌ పరారీ అవ్వగా.. అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. అయితే ఉద్యోగం ఇప్పిస్తానంటూ గతవారం సోని, ఆమె తండ్రి, సోదరుడిని కారులో తీసుకెళ్లాడు నిందితుడు రవి శేఖర్. కొద్ది దూరం వెళ్లిన […]

బ్రేకింగ్: బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ లభ్యం

ఏడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవి శేఖర్ ఆమెను వదిలివెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆమెను అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మరోవైపు రవి శేఖర్‌ పరారీ అవ్వగా.. అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు.

అయితే ఉద్యోగం ఇప్పిస్తానంటూ గతవారం సోని, ఆమె తండ్రి, సోదరుడిని కారులో తీసుకెళ్లాడు నిందితుడు రవి శేఖర్. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆమె తండ్రి, సోదరుడిని కారులో నుంచి దింపేసిన రవి.. సోనిని తనతో పాటే తీసుకెళ్లాడు. అతడి కోసం పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే.

Click on your DTH Provider to Add TV9 Telugu