IND Vs AUS: వాడు బుల్డోజర్‌రా తొక్కుకుంటూపోతాడు.. మళ్లీ ఊచకోత.. తేడా వస్తే టీమిండియా అస్సాంకే

ఆస్ట్రేలియా జట్టు బాక్సింగ్ డే టెస్టు పై గురి పెట్టింది. ఎలాగైనా గెలవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది. టీమిండియాకు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్.. పూర్తి ఫిట్ గా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఫిట్ నెస్ టెస్టులు క్లియర్ చేశాడు.

IND Vs AUS: వాడు బుల్డోజర్‌రా తొక్కుకుంటూపోతాడు.. మళ్లీ ఊచకోత.. తేడా వస్తే టీమిండియా అస్సాంకే
Ind Vs Aus
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 25, 2024 | 8:49 AM

క్రిస్మస్ రోజున ఆస్ట్రేలియా జట్టుకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు కీలక బ్యాటర్ ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు ఫిట్‌గా ఉన్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టులో ఆడే 11 మంది ఆటగాళ్ల పేర్లను ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ రెండు భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నాడు. నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో 19 ఏళ్ల యువ ఓపెనర్ సామ్ కాన్స్టాస్ జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో, గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌కు మరోసారి ఆడే అవకాశం లభించింది.

ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

ఫిట్‌నెస్ పరీక్షలో హెడ్ పాస్..

ఫిట్‌నెస్ పరీక్షలో హెడ్ పాస్ అయ్యాడు. రన్నింగ్ డ్రిల్స్, క్యాచింగ్ లాంటివి ప్రదర్శించి.. ఫిట్‌నెస్ టెస్టులో పూర్తిగా ఉత్తీర్ణత సాధించాడు ట్రావిస్ హెడ్. ఇది కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సహా మొత్తం ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఉపశమనం అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరఫున వరుసగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు ట్రావిస్ హెడ్. అడిలైడ్, గబ్బాలో అతడి సెంచరీలు కారణంగానే ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి రాగలిగింది.

ఇవి కూడా చదవండి

హెడ్​ఇప్పటివరకు ఈ సిరీస్‌లోనే 2 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో సహా 81.80 సగటుతో 409 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఇతడే. మరోవైపు, స్టీవ్ స్మిత్ 24.80 సగటుతో, మార్నస్ లబూషేన్ 16.40, ఉస్మాన్ ఖవాజా 12.60 సగటుతో బ్యాటింగ్ చేశారు. దీంతో హెడ్ మినహా ఆస్ట్రేలియా జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌లందరూ ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

హెడ్‌పై కమిన్స్ మాట..

గబ్బా టెస్టు తర్వాతే ట్రావిస్ హెడ్ గాయపడిన వార్త వెలుగులోకి వచ్చింది. అతడు క్వాడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడని, మెల్‌బోర్న్ టెస్టులో ఆడటంపై సందేహం ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు అన్ని రకాల భయాలు తొలగిపోయాయి. నాలుగో టెస్టులో హెడ్ ఆడతాడని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మీడియాకు తెలిపాడు. కమిన్స్ మాట్లాడుతూ, ‘హెడ్ రెండు రోజుల నుంచి కఠోరంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. ఇప్పుడు అతని గాయం గురించి ఆందోళన లేదు. అతను పూర్తి ఫిట్‌గా ఆడటానికి సిద్దంగా ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఏదైనా సమస్య ఎదురైతే, మేము దానిని పరిష్కరిస్తాం. కానీ అతను ఖచ్చితంగా ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఫిజియో అవసరం ఉండదని అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:

ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్ , మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..