AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA Meeting: ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు.. బుధవారం ఉదయం సదైవ్ అటల్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి చంద్రబాబు నివాళులర్పించారు.. అనంతరం ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు.

NDA Meeting: ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2024 | 4:37 PM

Share

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీ వేదికగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అమిత్‌షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, జేడీ-యూ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అలాగే జేడీ (ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి సహా ఎన్డీఏ పక్షాల కీలక నేతలు హాజరయ్యారు.

ఈ సమావేశం ఎజెండాపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, సుపరిపాలన, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. అయితే.. పార్లమెంట్ సమావేశాలలో ఎన్డీఏ పక్షాల సమన్వయంతో పాటు, రాజ్యాంగంపై ఉభయస సభల్లో జరిగిన చర్చపై ఈ సమావేశంలో చర్చించారు.

అమిత్ షా వ్యాఖ్యలు.. జమిలి ఎన్నికలపై..

అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని.. దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి చేయాలని బీజేపీ కోరుతోంది. దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.. జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకు వచ్చిన నూతన సంస్కరణలపై సైతం చర్చించినట్లు సమాచారం. జనవరి 8వ తేదీన జమిలి ఎన్నికలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు చర్చించినట్లు తెలుస్తోంది..

అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు భవిష్యత్‌లో ఈ ఫథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం పై ఎన్డీఏ సమావేశంలో చర్చించామని టీడీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలని బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్‌లను ఉపయోగించుకుని ఎంపీలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు కృష్ణదేవరాయలు తెలిపారు.

బిజీబిజీగా సీఎం చంద్రబాబు..

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు.. ఉదయం సదైవ్ అటల్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి చంద్రబాబు నివాళులర్పించారు.. అనంతరం ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు.. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.. అనంతరం అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..