Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..
పంజాబ్‌కు చెందిన కరడుగట్టిన సీరియల్ కిల్లర్ ఎట్లకేలకు పోలీసులకు చిక్కాడు. తన వాహనంపై లిఫ్ట్ ఇచ్చి.. గత 18 మాసాల్లో 11 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్వలింగ సంపర్కుడనే కారణంగా నిందితుడిని అతని కుటుంబం రెండేళ్ల క్రితం నుంచి దూరంపెట్టినట్లు తెలుస్తోంది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత 18 నెలల్లో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ అలియాస్ సోధి (33)గా పోలీసులు గుర్తించారు. స్వలింగ సంపర్కుడైన నిందితుడు.. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 11 మంది పురుషులను హతమార్చినట్లు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత ఓ వ్యక్తి వెనుక ‘మోసగాడు’ అని సీరియల్ కిల్లర్ రాశాడు. నిందితుడు మాజీ సైనికుడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తన వాహనంలో లిఫ్ట్ ఇచ్చి.. ఆ తర్వాత వారిని నిందితుడు టార్గెట్ చేసేవాడు. వారి దగ్గరున్న డబ్బును దోచుకుని.. అనంతరం వారిని హతమార్చేవాడు. అలాగే కొందరితో స్వలింగ సంపర్కం తర్వాత అత్యంత దారుణంగా హతమార్చేవాడు. చాలా కేసుల్లో బాధితులను మెడకు వస్త్రాన్ని గట్టికి బిగించి ఊపిరాడకుంటా చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంకొన్ని కేసుల్లో కొందరు బాధితుల తలపై ఇటుక లేదా ఇతర పదునైన ఆయుధాలతో బాది హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసిన తర్వాత పశ్చాత్తాపం చెందినప్పుడు మృతదేహం పాదాలను తాకేవాడినని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.
నిందితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వలింగ సంపర్కుడు కావడంతో రెండేళ్ల క్రితం నిందితుడిని కుటుంబీకులు దూరంపెట్టారు. అప్పటి నుంచి ఆ వ్యక్తితో తమకు సంబంధాలు లేవని కుటుంబీకులు తెలిపారు. ఆ వ్యక్తికి హెచ్ఐవీ సోకిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
సీరియల్ కిల్లర్ వివరాలు వెల్లడించిన పోలీసులు
In a major breakthrough, Rupnagar Police traced the blind murder case through scientific and technical measures of investigation and arrested an accused who involved in 11 murder cases. 03 cases are linked with district rupnagar.(1/2) pic.twitter.com/9uPVlwCX4L
— Rupnagar Range Police (@RupnagarRange) December 23, 2024
ఓ హత్య కేసుకు సంబంధించి రామ్ సరూప్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో.. మరో 10 మందిని హతమార్చినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదు హత్య కేసుల్లో ఇతని ప్రమేయమున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మిగిలిన హత్య కేసుల్లోనూ ఇతని ప్రమేయాన్ని నిర్ధారించేందుకు విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.