Chinni Krishna: టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం

టాలీవుడ్ ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నరసింహ నాయడుడు, ఇంద్ర, గంగోత్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు చిన్ని కృష్ణ.

Chinni Krishna: టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం
Chinni Krishna
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2024 | 4:56 PM

ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సుశీల(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ( డిసెంబర్ 25) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో చిన్నకృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు . సుశీల మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. కాగా సుశీల స్వగ్రామం తెనాలిలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చిన్నికృష్ణకు తల్లితో అనుబంధం ఎక్కువ. అమ్మపై తన ప్రేమను చాటుకుంటూ గతంలో ఎన్నో సార్లు అద్భుతమైన కవితలు రాశారాయన. ఇక మాతృదినోత్సవం రోజున అమ్మ ప్రేమకు అక్షర రూపమిస్తూ ఒక ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. ‘జన్మజన్మలకు నీకే జన్మించాలని ఉందమ్మా’ అంటూ చిన్న కృష్ణ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ కట్టి పడేసింది.

కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న కృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు సూపర్ హిట్ సినిమాలకు ఆయన కథలు అందించారు. స్క్రీన్‌ రైటర్ గా కూడా వ్యవహరించారు. బాలకృష్ణ నరసింహ నాయుడు, సీమ సింహం, మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర, అల్లు అర్జున్ గంగోత్రి, బద్రినాథ్ తదితర సినిమాలకు చిన్న కృష్ణ రచయితగా వ్యవహరించారు. అయితే ఆయన గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చివరిసారిగా 2012లో విడుదలైన జీనియస్ అనే సినిమాకు రైటర్ గా పని చేశారు చిన్ని కృష్ణ.

కాగా ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ పై కాస్త ఘాటుగా స్పందించారు చిన్ని కృష్ణ. ‘ బన్నీని అరెస్టు చేయడం చాలా దారుణం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కోసం తినకుండా ఉన్నాను’ అని అన్నారు.  బన్నీ పై ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ మొదటి సినిమాకు నేనే రచయితను.. ఆయనంటే నాకు ప్రాణమంటూ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?