Venu Swamy: శ్రీ తేజ్‌ కోసం వేణుస్వామి మృత్యుంజయ హోమం.. మరోసారి అల్లు అర్జున్ జాతకంపై కామెంట్స్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పరామర్శించారు. బుధవారం (డిసెంబర్ 25) కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన రేవతి భర్త భాస్కర్, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడారు. అలాగే ఆర్థిక సాయం కూడా అందజేశారు.

Venu Swamy: శ్రీ తేజ్‌ కోసం వేణుస్వామి మృత్యుంజయ హోమం.. మరోసారి అల్లు అర్జున్ జాతకంపై కామెంట్స్
Venu Swamy
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2024 | 9:39 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచారు . బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయన రేవతి భర్త భాస్కర్ ను కలిసి పరామర్శించారు. అనంతరం రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. ‘శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నాను. శని ఉండడం వల్ల అల్లు అర్జున్ కు ఈ సంఘటన జరిగింది. అతని జాతకం వచ్చే ఏడాది మార్చి మార్చి 29 వరకు బాగోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కావాలని ఏది చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయి. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళ లోంచి నీళ్లు వచ్చాయి. శ్రీ తేజ కోలుకుంటాడన్న నమ్మకం ఉంది. కచ్చితంగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. శ్రీ తేజకు మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తాను. పాప కు రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాను.వారం రోజుల్లో హోమం నిర్వహిస్తాను. ఆ పిల్లాడికి ఏమి కాదు’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా బుధవారం శ్రీ తేజ్ ను పరామర్శించారు.  పిల్లాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్‌ను చూడాలని అందరికీ ఆత్రుతగా ఉందని.. కొన్న పరిధుల వల్ల కుదరడం లేదన్నారు. తమ కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరఫున శ్రీతేజ్  కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జానీ మాస్టర్ వెంటన ఆయన సతీమణి కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు శ్రీ తేజ్ కుటుంబానికి అల్లు అరవింద్ రూ. 2కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.

కిమ్స్ ఆస్పత్రిలో వేణు స్వామి, జానీ మాస్టర్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!