Watch Video: వామ్మో.. తిరుమల మెట్ల మార్గంలో ఎంత పె..ద్ద.. పామో.. రెస్క్యూ చేస్తుండగా ఏం చేసిందో తెలుసా..?
తిరుమల నడక దారిలో 7 ఏడవ మైలు, 2500 మెట్టు వద్ద కొండచిలువను గుర్తించిన భక్తులు.. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక పాములను పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకొని నడక మార్గంలో ఒక షెడ్ లో మూలన చేరిన భారీ కొండ చిలువను రెస్క్యూ చేశారు.
శేషాచలం కొండలు ఎన్నో జీవరాసులకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉంది. అరుదైన వృక్ష, జంతు జాతులకు ఆవాసంగా ఉన్న తిరుమల కొండల ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి కొండల నడుమ కోనేటి రాయుడుని దర్శించుకునేందుకు రోజూ భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.. చాలామంది స్వామి వారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తుంటారు.. అయితే.. తిరుమలకు చేరే మెట్ల మార్గాల్లో లెక్కలేనన్ని సర్ఫాలున్నాయి.
అరుదైన జాతి సర్పాలు ఉన్న తిరుమల కొండల్లో 22 రకాల పాముల ఉనికి ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతుంటారు.. ఇలా తరచూ తిరుమలలో కనిపించే పాములు భక్తులను భయాందోళనకు గురి చేస్తుంటే వాటిని సేఫ్‌గా బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం టిటిడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనైంది. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో 14 అడుగుల కొండచిలువ భక్తుల కంట పడింది.. దీంతో భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
వీడియో చూడండి..
నడక దారిలో 7 ఏడవ మైలు, 2500 మెట్టు వద్ద కొండచిలువను గుర్తించిన భక్తులు.. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక పాములను పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకొని నడక మార్గంలో ఒక షెడ్ లో మూలన చేరిన భారీ కొండ చిలువను రెస్క్యూ చేశారు.. కొండచిలువ తలభాగాన్ని పట్టుకొని లాక్కుంటూ బయటకు తీసుకువచ్చారు..
14 అడుగుల భారీ కొండచిలువను భక్తులు ఎంతో ఆసక్తిగా గమనించారు.. మొదట భయపడ్డా ఆ తరువాత ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దాదాపు 14 అడుగులకు పైగానే ఉన్న కొండచిలువను మెట్ల మార్గంలో లాక్కుంటూ తీసుకెళ్లి ఎట్టకేలకు అవ్వా చారి కొన ప్రాంతంలో వదిలిపెట్టారు టీటీడీ ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..