బ్రేకింగ్: రామ్‌గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి జరిగింది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వాటర్స్‌లో ఉన్న ఆర్జీవీ కంపెనీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. అకస్మాత్తుగా ఆర్జీవీ కార్యాలయంపై దాడి చేశారు ఓయూ విద్యార్థులు. ఒక్కసారిగా ఆర్జీవీ కార్యాలయంలోకి..
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి జరిగింది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వాటర్స్‌లో ఉన్న ఆర్జీవీ కంపెనీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. అకస్మాత్తుగా ఆర్జీవీ కార్యాలయంపై దాడి చేశారు ఓయూ విద్యార్థులు. ఒక్కసారిగా ఆర్జీవీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు స్టూడెంట్స్. పవర్ స్టార్ సినిమాపై ఓయూ జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నందగిరి, సతీష్, సంపత్ నాయక్, రమేష్, నాగరాజు, కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కాగా తాజాగా వర్మ.. ‘పవర్ స్టార్ – ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, గడ్డి తింటావా అనే పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో లీకైనట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. దీని వెనుక తన ఆఫీస్ స్టాఫ్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపత్యంలో ట్రైలర్‌ను వీక్షించేందుకు డబ్బు చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. అలాగే ‘గడ్డి తింటావా’ సాంగ్ 20 లక్షల వ్యూస్ సాధించినందుకు అభిమానులకు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ తెలిపారు.
I am getting lot of threats but no problem because I always lived under threats ..My STAR is more POWERful than POWER STAR BASTI ME SAWAAL ??? https://t.co/pUOeeGbEYn
— Ram Gopal Varma (@RGVzoomin) July 22, 2020
Read More:
షిర్డీ సాయిబాబా దర్శన భాగ్యం ఎప్పుడంటే?
వాట్సాప్‌లో మరిన్ని సేవలు.. త్వరలోనే పెన్షన్ సర్వీసులు కూడా!