Assam Election 2021 2nd Phase Voting Update: అసోంలో ముగిసిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే.. ‌

Subhash Goud

| Edited By: Narender Vaitla

Updated on: Apr 01, 2021 | 8:11 PM

అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ రెండో దశలో 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ 34 సీట్లలో,

Assam Election 2021 2nd Phase Voting Update: అసోంలో ముగిసిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే.. ‌
Assam Elections 2021

Assam Election 2021 2nd Phase Voting Update: అస్సాంలో రెండో విడద పోలింగ్ ముగిసింది. 39 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా.. సాయంత్రం 7 గంటల వరకు 74.79 శాతం పోలింగ్ జరిగింది. నోవ్‌గాంగ్ నియోజకవర్గంలో అత్యధికంగా 83శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఇక మూడో దశ (చివరి దశ) ఏప్రిల్ 6న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ రెండో దశలో 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ 6 స్థానాల్లో, యూపీపీఎల్‌ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్‌ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. ఈ రెండో దశ పోలింగ్‌లో మొత్తం 36,09,959 మంది మహిళలతో సహా 73,44,631 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. ఇక మొత్తం 1,09,292 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అయితే మహాకూటమి నుంచి కాంగ్రెస్‌ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్‌ 7 స్థానాల్లో, బీపీఎఫ్‌ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్‌ 19 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌ ఉన్నారు.

భారీ భద్రత

ఇందులో భాగంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సీసీ టీసీలను సైతం ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.

https://www.youtube.com/watch?v=XdAGkCCKf0w

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2021 08:06 PM (IST)

    ముగిసిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మూడో దశ ఎప్పటి నుంచంటే..

    ఈశాన్య రాష్ట్రం అస్సాంలో రెండో విడద పోలింగ్ ముగిసింది. 39 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా.. సాయంత్రం 7 గంటల వరకు 74.79 శాతం పోలింగ్ జరిగింది. నోవ్‌గాంగ్ నియోజకవర్గంలో అత్యధికంగా 83శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఇక మూడో దశ (చివరి దశ) ఏప్రిల్ 6న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

  • 01 Apr 2021 06:26 PM (IST)

    ముగింపు దశకు చేరుకున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు..

    అస్సాంలో జరుగుతోన్న రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు అస్సాంలో 73.03 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

  • 01 Apr 2021 05:28 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతోన్న అస్సాం ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు..

    అస్సాంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 67.60 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ పూర్తికావడానికి మరో 30 నిమిషాలు మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ లెక్కన ఓటింగ్ శాంతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుుతున్నారు.

  • 01 Apr 2021 04:38 PM (IST)

    అస్సాంలో కొనసాగుతోన్న రెండో దశ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం 3:30 వరకు..

    అస్సాంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు అస్సాం 57.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 01 Apr 2021 01:14 PM (IST)

    ఒంటి గంట వరకు 48.24 శాతం పోలింగ్‌

    అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.24 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 01 Apr 2021 11:39 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు 16.20 శాతం పోలింగ్‌

    అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 1 గంటల వరకు 16.20 శాతం పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

  • 01 Apr 2021 09:49 AM (IST)

    పోలింగ్‌ శాతం

    ఉదయం 9గంటల వరకు అసోంలో 10.51శాతం, బంగాల్​లో 13.14శాతం పోలింగ్​ నమోదైంది. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.51 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 01 Apr 2021 09:12 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ రైల్వే శాఖ మంత్రి

    అస్సాం మాజీ రైల్వే శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు రాజెన్ గోహైన్ నాగావ్ లోని తన ఓటును వినియోగించుకున్నారు. మొదటి దశలో మొత్తం 47 సీట్లలో 35 కి పైగా సీట్లు బీజేపీకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రెండవ దశలో అధిక సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • 01 Apr 2021 08:58 AM (IST)

    పోలింగ్‌ కేంద్రాల వద్ద స్క్రీనింగ్‌, శానిటైజర్స్‌

    కరోనా వైరస్‌ కారణంగా అసోంలో రెండో విడత పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేస్తున్నారు. అలాగే శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

  • 01 Apr 2021 08:36 AM (IST)

    31,000 మందితో భద్రత

    అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో 31,00 మంది కేంద్ర ఆర్మీ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ పోలీసు దళాలతో పాటు వేలాది మంది రాష్ట్ర భద్రతా దళాల సిబ్బందిని ఈ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నియమించారు.

  • 01 Apr 2021 08:22 AM (IST)

    ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​..

    రెండో విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. అసోంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బంగాల్​ ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు.

  • 01 Apr 2021 08:12 AM (IST)

    మోరాయిస్తున్న ఈవీఎంలు..పోలింగ్‌ నిలిపివేత

    రెండవ దశ పోలింగ్‌లో హోజాయ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటు వేసేందుకు భారీ క్యూలైన్‌లో ఉన్నారు. ఇదే సమయంలో ఈవీఎంలు మోరాయించడంతో బాలికా విద్యాలయంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 146 వద్ద తాత్కాలికంగా పోలింగ్‌ను నిలిపివేశారు.

  • 01 Apr 2021 08:09 AM (IST)

    ఆలస్యంగా పోలింగ్‌

    అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నౌగాన్లోని లా కాలేజీలో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడం వల్ల నౌగావ్‌లోని లా కాలేజీలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 26 వద్ద ఓటింగ్ ఆలస్యం అయింది.

  • 01 Apr 2021 08:01 AM (IST)

    కొనసాగుతున్న పోలింగ్

    అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో, 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 89,875 మంది ఓటర్లు ఉన్నారు మరియు మొదటిసారి 90 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Published On - Apr 01,2021 8:09 PM

Follow us
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
చలికాలంలో ఆకు కూరలు తినకూడదా.. దీనిలో నిజమెంత..? నిపుణుల సూచన..
చలికాలంలో ఆకు కూరలు తినకూడదా.. దీనిలో నిజమెంత..? నిపుణుల సూచన..
అదానీ డబ్బు తెలంగాణకు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
అదానీ డబ్బు తెలంగాణకు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!