- Telugu News Photo Gallery Political photos Second phase polling ends in west bengal and assam assembly elections 2021
బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ముగిసిన రెండో దశ పోలింగ్.. భారీగా తరలివచ్చిన ఓటర్లు.. బారులు తీరిన క్యూలైన్ చిత్రాలు…
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ చేపట్టారు. రెండో దశలో ఓటు వేసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
Updated on: Apr 01, 2021 | 9:54 PM

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ చేపట్టారు. రెండో దశలో మొత్తం 75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ముఖ్యంగా మమతా, సువేందు అధికారి బరిలోఉన్న నందిగ్రామ్‌లోనూ భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం విశేషం.

కరోనా నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు తమ ఓటు వేశారు.

తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సైతం వీట్ ఛైర్‌లో వచ్చిన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళే పోలింగ్ జరుగింది. ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి ఆమెకు గట్టిపోటీ పడుతున్నారు.

బెంగాల్‌లోని అత్యధికంగా కతూల్‌పూర్ నియోజకవర్గంలో 87శాతం ఓటింగ్ నమోదుకాగా, చంద్రకోనా, ఇండస్, పత్తార్‌ప్రతిమ నియోజకవర్గాల్లో 86శాతం ఓటింగ్ నమోదైంది.




