AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి కొడుకు డాక్టర్ కాబోతున్నాడు..

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు ఓ పేద విద్యార్థి. అందుకు తగిన విధంగా కృషిచేసేవారికి అసాధ్యమంటూ ఏమీ ఉండదని అరవింద్ అనే విద్యార్థి నిరూపించాడు.

పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి కొడుకు డాక్టర్ కాబోతున్నాడు..
Balaraju Goud
|

Updated on: Oct 24, 2020 | 12:20 PM

Share

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు ఓ పేద విద్యార్థి. అందుకు తగిన విధంగా కృషిచేసేవారికి అసాధ్యమంటూ ఏమీ ఉండదని అరవింద్ అనే విద్యార్థి నిరూపించాడు. చెత్త సేకరించి కుటుంబాన్ని పోషించే తన తండ్రికి గ్రామంలో మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు. డాక్టర్ కావాలన్న కలను సాకారం చేసుకుని కుటుంబాన్ని సంతోషంలో ముంచాడు.

గత వారం విడుదల అయిన నీట్-2020లో ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ 620 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియా స్థాయిలో 11,602, ఓబీసీ కేటగిరీలో 4,392వ ర్యాంకు దక్కించుకున్నాడు. యూపీలోని కుషీనగర్ పరిధిలో గల బర్డీ గ్రామానికి చెందిన అరవింద్ తండ్రి భిఖారీ కుమార్ పాత సామాను సేకరించే పని చేస్తుంటాడు. రిక్షాతో వీధుల్లో తిరుగుతూ ఇళ్లలోని పాత సామాను కొనుగోలు చేస్తుంటాడు. అరవింద్ తల్లిదండ్రులు తమ కుమారుడు డాక్టర్ కావాలని కలలుగనేవారు. ఇందుకోసం కుమారుడిని ఒక కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు.

తొలిప్రయత్నింలో అరవింద్‌కు మంచి ర్యాంక్ రాలేదు. రెండవ ప్రయత్నంలో ఉన్నత ర్యాంకు సంపాదించాడు. గోరఖ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో 8 కిలోమీటర్ల దూరం సైకిల్ పై చదువు అభ్యసించాడు. 10వ తరగతిలో 48శాతం, 12 వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తక్కువ మార్కులతో చదువులు గట్టెక్కుతున్నప్పటికీ డాక్టర్ కావాలన్న బలమైన పట్టుదలతో నీట్ పరీక్షకు సిద్ధమై మంచి ర్యాంకు సాధించాడు. ఈ సందర్బంగా అరవింద్ మాట్లాడుతూ తమ గ్రామంలో తానే మొదటి డాక్టర్‌ను అని, ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఆర్థోపెడిక్ సర్జన్ కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. గ్రామంలోనే తొలి విద్యార్థి మెడికల్ ఎంపిక రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us