నాడు ఏపీ అసెంబ్లీని సంప్రదించాకే విభజన: మనీష్ తివారీ
దేశంలో కశ్మీర్ సంస్థానం విలీనం వెనుక ఎంతో చరిత్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని తెలిపారు. బ్రిటీష్ పాలనలోనూ కశ్మీర్ సంస్థానంగా ఉందని.. మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్, కశ్మీర్, జునాఘడ్ సంస్థానాలు కూడా స్వతంత్రంగా ఉండేవని ఆయన గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ […]
దేశంలో కశ్మీర్ సంస్థానం విలీనం వెనుక ఎంతో చరిత్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని తెలిపారు. బ్రిటీష్ పాలనలోనూ కశ్మీర్ సంస్థానంగా ఉందని.. మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్, కశ్మీర్, జునాఘడ్ సంస్థానాలు కూడా స్వతంత్రంగా ఉండేవని ఆయన గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయం లేకుండా ఆర్టికల్ 370ను రద్దు చేయలేరని.. రాష్ట్రపతిపాలన ఉన్న సమయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారని తివారీ ప్రశ్నించారు.
ఏదైనా రాష్ట్ర విభజన చేయాలనుకున్నప్పుడు అక్కడి అసెంబ్లీ తీర్మానం తప్పనిసరిగా ఉండాలని.. గతంలో యూపీఏ హయాంలో ఆర్టికల్ 3 ప్రకారమే ఏపీ, తెలంగాణ విభజన జరిగిందని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీని సంప్రదించాకే విభజన చేశామని మనీష్ తివారీ చెప్పుకొచ్చారు.